బీసీని బీఆర్‌ఎస్ అధ్యక్షుడిని చేయాలి: జాజుల
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:03 AM
బీఆర్‌ఎస్ పార్టీకి పన్నెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం నిబంధనలకు విరుద్ధమని, కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో బీసీని నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చే శారు.
బర్కత్‌పుర, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీకి పన్నెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం నిబంధనలకు విరుద్ధమని, కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో బీసీని నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చే శారు. అన్ని రంగాల్లో బీసీలను అణిచివేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వరంగల్ రజతోత్సవ సభలో బీసీ పాలసీని ప్రకటించాలని ఆయన అన్నారు. అధికారం కోల్పోయి 16 నెలలు గడచినా ఎక్కడున్నాడో తెలియని కేసీఆర్ అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాజుల విడుదల చేశారు.
కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో బీసీలే బీఆర్‌ఎ్‌సను బొంద పెడతారని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇస్తుండగా కేవలం బీఆర్‌ఎస్ మాత్రమే బీసీలను అణచివేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని వరంగల్ సభలో ప్రకటించాలని జాజుల డిమాండ్ చేశారు.