Krishna Mohan: విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీసీ కమిషన్ సిఫారసులు ఉండాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:35 AM
బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లను పెంచాలంటే అందుకు బీసీ కమిషన్ సిఫారసులు అనివార్యమని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు.

బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లను పెంచాలంటే అందుకు బీసీ కమిషన్ సిఫారసులు అనివార్యమని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా చేసినప్పటికీ కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదింపజేయాలంటే అందుకు కమిషన్ నివేదికలు, విశ్లేషణలు కీలకమన్నారు. రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ల పెంపు చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. అయితే షెడ్యూల్ 9లో చేర్చినప్పటికీ న్యాయ సమీక్షకు అవకాశం ఉందని, కనుక ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.