Share News

Bandi Sanjay: సైకిల్‌ అందుకున్న విద్యార్థిని భావోద్వేగం

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:56 AM

సంజయన్నా మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Bandi Sanjay: సైకిల్‌ అందుకున్న విద్యార్థిని భావోద్వేగం

  • ఓదార్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌

మానకొండూర్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘సంజయన్నా మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తినడానికే ఇబ్బంది పడుతున్నాం. అలాంటి నాకు ఇంత పెద్ద సైకిల్‌ బహుమతిగా ఇచ్చారు’’ అంటూ ఓ విద్యార్థిని భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మానకొండూరు బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండలం తాడికల్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బూస అర్చన భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సంజయ్‌ ఆమెను ఓదార్చారు.

Updated Date - Aug 27 , 2025 | 05:56 AM