Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అబద్ధపు హామీలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:35 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుప్పిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుప్పిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇక్కడ 6 గ్యారెంటీల అమలు లాగే ఢిల్లీ ఎన్నికల హామీలను సీఎం రేవంత్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రూ.15 వేల రైతు భరోసా, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4వేల పింఛన్ వంటి హామీలు ఏమయ్యాయని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రె్‌సను మహారాష్ట్ర, హరియాణాల్లో అక్కడి ప్రజలు ఓడించారని గుర్తుచేస్తూ, ఢిల్లీలో కూడా అదే జరగబోతోందని జోస్యం చెప్పారు.