Bandi Sanjay: రేవంత్.. చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:56 AM
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రంలో అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. సీ ఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. తేదీ, సమయం నిర్ణయించాలని ప్రతి సవాల్ విసిరారు.

కేంద్రం నిధులు, 6 గ్యారెంటీలు, అవినీతిపైనా మాట్లాడదాం : కేంద్ర మంత్రి సంజయ్
కరీంనగర్/కామారెడ్డి/హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రంలో అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. సీ ఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. తేదీ, సమయం నిర్ణయించాలని ప్రతి సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు, అవినీతి, అక్రమాలు, 15 శాతం కమీషన్‌పైనా చర్చకు సిద్ధమన్నారు. శనివారం కరీంనగర్‌లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ ప్రభారీలతో నిర్వహించిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కాంగ్రె్‌సతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నది బీఆర్‌ఎస్ వాళ్లేనని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపిం గ్, కేటీఆర్ బావ మరిది ఫాంహౌ్‌సలో డ్రగ్స్ కేసు, కార్ రేసు స్కాంలో ఆధారాలున్నా.. కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిజమైన కేఆర్ బ్రదర్స్ కేటీఆర్, రేవంత్‌రెడ్డిలే అన్నారు. అవినీతి కేసుల్లో అరెస్ట్ కాకుండా కేసీఆర్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బులిచ్చి వస్తున్నాడని ఆరోపించా రు. కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్ ఏటీఎంలా మారిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దుర్ఘటన బాధితులకు సాయం అందించాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు.
గెలిచాక కాంగ్రె్‌సపై యుద్ధమే..
కాంగ్రె్‌సలో ఐదుగురు మంత్రులదే ఆధిపత్యం నడుస్తోందని.. 15శాతం కమీషన్లు ఇవ్వనిదే నిధులు విడుదల చేయ డంలేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లు సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. కామారెడ్డి మునిసిపల్ పరిధిలోని లింగాపూర్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్‌మాట్లాడారు. బీజేపీ ఎమ్మె ల్సీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపిస్తే.. వారంలో కాం గ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు యుద్ధం ప్రకటిస్తామన్నారు.