Share News

Political Allegations: బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ సర్కార్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:07 AM

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ ఏ పద్ధతులైతే అవలంబించి ప్రజల ఛీత్కారానికి గురైందో ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే విధానం కొనసాగిస్తోందని విమర్శించారు.

Political Allegations: బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ సర్కార్‌

  • ఆ రెండు పార్టీలు ఒక్కటే

  • కాంగ్రెస్‌ డిక్లరేషన్‌లకు విలువ లేదు

  • మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ సర్కార్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ ఏ పద్ధతులైతే అవలంబించి ప్రజల ఛీత్కారానికి గురైందో ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే విధానం కొనసాగిస్తోందని విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాలరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రకటించిన డిక్లరేషన్‌లకు విలువలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అక్రమంగా గృహ నిర్బంఽధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.


కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విపక్ష గొంతు నొక్కుతోందని ఆరోపించారు. అయితే ఈ అంశంలో బీఆర్‌ఎ్‌సకు వెసులుబాటు ఇచ్చారన్నారు. ‘మేం కాకుంటే మీరు.. మీరు కాకుంటే మేం అధికారంలో ఉంటాం.. అన్నట్లుగా ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే వాటి విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటున్నాయి’ అని బాలరాజు ఆరోపించారు. ఇక, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పొర్లుదండాలు పెట్టినా ప్రధాని కాబోరని విమర్శించారు.

Updated Date - Aug 13 , 2025 | 05:07 AM