Share News

Hyderabad: పాతబస్తీలో బక్రీద్‌ సందడి..

ABN , Publish Date - Jun 05 , 2025 | 08:38 AM

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బక్రీద్‌ సందడి మొదలైంది. వివిధ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల కొనుగోళ్లతో మార్కెట్ అంతా సందడిగా మారిపోయింది.

Hyderabad: పాతబస్తీలో బక్రీద్‌ సందడి..

- జోరుగా గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల కొనుగోళ్లు

- తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

- గతేడాది కంటే పెరిగిన ధరలు

హైదరాబాద్: పాతబస్తీలో బక్రీద్‌ పండగ సందడి మొదలైంది. శనివారం పండగ కావడంతో ‘ఖుర్బానీ’ ఇవ్వటానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు రోడ్డు, మలక్‌పేట ఫైర్‌స్టేషన్‌ రోడ్డు, అక్బర్‌బాగ్‌ రహదారులపై వ్యాపారులు గొర్రెల అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. కశ్మీర్‌, మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఏపీ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి(Nalgonda, Mahabubnagar, Sangareddy), కల్వకుర్తి, షాద్‌నగర్‌ మెదక్‌ తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను భారీగా తరలించారు. గతంలో కంటే ఈసారి పాతబస్తీకి జీవాలు అధిక సంఖ్యలో చేరాయి.


పెరిగిన ధరలు

పొట్టేళ్లు, గొర్రెలు, మేకల ధరలు పెరిగాయి. గతంలో రూ.8 వేలకు విక్రయించగా ప్రస్తుతం రూ. 10 వేలకు విక్రయిస్తున్నారు. బరువును బట్టి ధరలలో తేడాలుంటాయి. కొన్నింటి ధర రూ. 15 వేల నుంచి రూ. 50 వేలు పలుకుతున్నాయి. ముఖ్యంగా అన్నింటి కంటే పొటేళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. రాజస్థాన్‌, కశ్మీర్‌, రాంపురి మేకలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు ప్రారంభించారు. దళారులు రైతులు వద్ద తక్కువ ధరకు కొని మార్కెట్‌లో ఎక్కువగా ధరకు అమ్ముతున్నారు.

city3.2.jpg


మూడు భాగాలుగా..

పండగ రోజు ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. దాన్ని మూడు సమాన భాగాలు చేస్తారు. ఒక భాగం ఖుర్బానీ ఇస్తున్నవారికి, రెండో భాగం బంధువులకు, మూడో భాగం పేద ముస్లింలకు దానం చేస్తారు. ఖుర్బానీ ఇచ్చేవారు వడ్డీతో కూడిన అప్పు ఇవ్వరాదు తీసుకోరాదు.

city3.3.jpg


అన్ని ఏర్పాట్లు చేశాం..

గొర్రెల అమ్మకం కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశాం. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగకుండా, కేంద్రాల వద్ద జేబు దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం, జంతువుల వ్యర్థాలు ఎప్పటికప్పుడూ తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయించాం. అక్రమంగా గోవుల రవాణాను అడ్డుకునేందుకు డివిజన్‌ పరిధిలో మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం.

- సోమ వెంకట్‌రెడ్డి, ఏసీపీ, సైదాబాద్‌



ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 05 , 2025 | 08:38 AM