Narsingi Drugs Case: నార్సింగి డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:20 AM
పక్కా ప్లాన్‌తో ముంబై నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేవాడు. ముంబైకి విమానంలో వెళ్లేవాడు. తిరిగి వచ్చేటపుడు ట్రావెల్స్ బస్‌లో డ్రగ్స్ తీసుకువచ్చేవాడు.
నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఓ నిందితుడ్ని ఎయిర్ లైవ్ పబ్ పార్ట్‌నర్‌గా గుర్తించారు. ఇక, ఈ కేసులో అనంత కుమార్, వీరబాబు కీలకంగా మారారు. అనంత కుమార్ ఏడాదిన్నర కాలంలో వీరబాబు ద్వారా సుమారు 20 సార్లు కొకైన్ తెప్పించుకున్నాడు. అనంత కుమార్ సూచన మేరకు వీరబాబు ముంబైనుంచి కొకైన్ కొనుగోలు చేసి తీసుకొస్తున్నాడు.
పక్కా ప్లాన్‌తో ముంబై నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేవాడు. ముంబైకి విమానంలో వెళ్లేవాడు. తిరిగి వచ్చేటపుడు ట్రావెల్స్ బస్‌లో డ్రగ్స్ తీసుకువచ్చేవాడు. ముంబై నుంచి తీసుకొస్తున్న డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో అనంత కుమార్‌కు అప్పగించే వాడు. వీరబాబు ముంబై వెళ్లిన ప్రతిసారి 100 గ్రాముల కొకైన్ తీసుకువచ్చేవాడు.
ఇలా డ్రగ్స్ తీసుకొచ్చినపుడు అనంత కుమార్15 వేల రూపాయలు వీరబాబుకి ఇచ్చేవాడు.అనంత కుమార్ హైదరాబాద్‌లో గ్రాము కొకైన్ 6 నుండి 8 వేలకు విక్రయించే వాడు. అనంత కుమార్ డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించాడు అన్న కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
కొత్త గూగుల్ డూడుల్‌కి ఫుడ్ లవర్స్ ఫిదా.. మీరు చూశారా?