Google Idli Doodle: కొత్త గూగుల్ డూడుల్‌కి ఫుడ్ లవర్స్ ఫిదా.. మీరు చూశారా?
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:16 AM
ఈ రోజు గూగుల్ డూడుల్ ఫుడ్ థీమ్‌లో భాగంగా ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ టిఫిన్ తయారీని ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు. ఇడ్లీ పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడం వంటివి చూపించారు. ఇడ్లీ, సాంబార్ సౌత్ లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోని ప్రతి సమాచారం తెలుసుకునేందుకు అందరూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ నే వాడుతుంటారు. అలానే అందులోనే డూడుల్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఇది రోజుకో థీమ్ తో స్పెషల్ గా కనిపిస్తుంది. ప్రత్యేక రోజులు, ప్రముఖ వ్యక్తుల జయంతి, పుట్టిన రోజు వేడుకలను గుర్తూ చేస్తూనే గూగుల్ సంస్థ డూడుల్ ను క్రియేట్ చేస్తుంటుంది. ఇప్పటికే అనేక సార్లు స్పెషల్ గా కనిపించిన గూగుల్ డూడుల్ శనివారం (అక్టోబరు 11) మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే.. ఈసారి దీన్ని దక్షిణాది వంటకమైన ‘ఇడ్లీ’ ప్రత్యేకంగా (Google Idli Doodle) రూపొందించారు
నేటి గూగుల్ డూడుల్ (Google Doodle) ఫుడ్ థీమ్‌లో భాగంగా ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ టిఫిన్ తయారీని ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు. ఇడ్లీ (Idle) పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడం వంటివి చూపించారు. ఇడ్లీతో పాటు సాంబార్, కారం పొడి, చట్నీతో అరటి ఆకుపై వడ్డించే విధానాన్ని గూగుల్ డూడుల్ చక్కగా చూపించారు. Googleకు సంబంధించిన ప్రతి లెటర్ ను ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ డూడుల్ నెటిజన్లను, ముఖ్యంగా ఇండియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఫుడ్ లవర్స్ అయితే ఈ డూడుల్ చూసి ఫిదా అవుతున్నారు.
ఇడ్లీ(Idle)తో ఉన్న గూగుల్ డూడుల్(Google Doodle) చూస్తుంటే నోరు ఊరుతుందటు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే వేడివేడి ఇడ్లీ సాంబార్ తో డూడుల్ ప్రత్యేకంగా నిలిచిందని అంటున్నారు. అయితే ఇలా గూగుల్ (Google) డూడుల్‌లో ఇండియన్ ఫుడ్స్ ను పెట్టడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం పానీపూరీ ప్రపంచ రికార్డుకు గుర్తుగా.. గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతుల్లో ఓ ఇంటరాక్టివ్ గేమ్‌ను కూడా పెట్టింది. అప్పట్లో ఇది కూడా తెగ వైరల్ అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Tobacco Cancer Risk: సిగరెట్ల కన్నా పొగాకు మరింత ప్రమాదకరమా..అధ్యయనంలో షాకింగ్ విషయాలు
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు