Share News

Amit Shah: 29న రాష్ట్ర పర్యటనకు అమిత్‌ షా

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:02 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 29న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన హైదరాబాద్‌లో సమావేశమవుతారు.

Amit Shah: 29న రాష్ట్ర పర్యటనకు అమిత్‌ షా

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 29న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన హైదరాబాద్‌లో సమావేశమవుతారు. అనంతరం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. స్థానిక పాలిటెక్నిక్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్‌ షా పర్యటనపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నాయి.

Updated Date - Jun 16 , 2025 | 05:02 AM