Ameenpur :రెండు గ్రామాలతోనే మండల పరిషత్
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:50 AM
రాష్ట్రంలోనే అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్ నిలవనుంది. కేవలం రెండు గ్రామ పంచాయతీలతో మండల పరిషత్‌ను ఏర్పాటు చేయడంతో ఈ రికార్డును దక్కించుకోనుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డును
రాష్ట్రంలోనే అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్
పటాన్‌చెరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్ నిలవనుంది. కేవలం రెండు గ్రామ పంచాయతీలతో మండల పరిషత్‌ను ఏర్పాటు చేయడంతో ఈ రికార్డును దక్కించుకోనుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 6 గ్రామాలను ఇటీవల అమీన్‌పూర్ మునిసిపాలిటీలో విలీనం చేశారు. దీంతో వడక్‌పల్లి, జానకంపేట గ్రామపంచాయతీలుగా మిగిలిపోయాయి. ఈ రెండు పంచాయతీలను ఐదు ఎంపీటీసీ స్థానాలుగా విభజించి మండల పరిషత్‌గా ఏర్పాటు చేశారు. వడక్‌పల్లిలో ఏడువందల జనాభాకు గాను 3 ఎంపీటీసీ స్థానాలు, జానకంపేటలో ఆరు వందల జనాభాకు గాను 2 ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ఒక ఎంపీటీసీ కింద కనీసం 3-5వేల జనాభా ఉండాలన్న నిబంధన ఉంది. కానీ, అధికారులు మొత్తం 1,105ఓట్లకు గాను రెండు గ్రామాల్లో 5 ఎంపీటీసీలను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ ఏర్పాటుకు కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న నిబంధన ప్రకారం ఈ విభజన జరిగినట్లు చెప్తున్న అధికారులు, జనాభా, ఓట్లను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోలేదని అంటున్నారు. అయితే.. తమను కూడా మునిసిపాలిటీలో విలీనం చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు త్వరలోనే సీఎం రేవంత్‌ను కలిసి ఆ గ్రామాలను అమీన్‌పూర్ మునిసిపాలిటీలో విలీనం చేయాలని కోరతామని అమీన్‌పూర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు గంగుల సుధాకర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి