Helpline: అత్యవసర సేవలకు 112
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:00 AM
అన్ని అత్యవసర సేవలకు 112 నంబర్‌కు డయల్ చేయవచ్చని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వేర్వేరు సేవలకు ఇకపై వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
అన్ని సేవలు ఒకే గొడుగు కిందకు
పోలీసు, ఫైర్, అంబులెన్స్,మహిళలు, చిన్నారులపై నేరాల నిరోధానికి
112 మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు
ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అన్ని అత్యవసర సేవలకు 112 నంబర్‌కు డయల్ చేయవచ్చని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వేర్వేరు సేవలకు ఇకపై వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ‘‘ఇంతకు ముందు పోలీసు సేవలకు డయల్-100కు ఫోన్ చేసేవారు. అగ్నిమాపక శాఖకు 101, అంబులెన్స్‌కు 108, క్రైమ్ స్టాపర్‌కు 1090, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు 1098, మహిళలపై నేరాల నిరోధానికి 181 నంబర్లకు ఫోన్ చేయాల్సి వచ్చేది. వీటన్నింటినీ 112 పరిధిలోకి తీసుకువచ్చాం. రోడ్డు ప్రమాదాలు(ట్రామాకేర్), ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ 112కు ఫోన్ చేసి, సహాయం పొందవచ్చు’’ అని ఆయన వివరించారు. 112 సేవలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చామని, అన్ని సేవలకు సత్వర స్పందన ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన 112-ఇండియా యాప్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చని, ఆండ్రాయిడ్ ఫోన్లలో పవర్ బటన్‌ను వరుసగా మూడుసార్లు నొక్కినా.. డయల్ 112కి కాల్ వెళ్తుందని పేర్కొన్నారు. ఇటీవల పలు అగ్నిప్రమాదాల విషయంలో ఐసీసీసీ నుంచి కరీంనగర్, హైదరాబాద్ శివార్లలోని అగ్నిమాపక అధికారులను అప్రమత్తం చేసి, వెంటనే సంఘటనాస్థలికి చేరుకునేలా చేశామని ఆయన గుర్తుచేశారు. 112 సేవల్లో మహిళలు, చిన్నారులపై నేరాకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తామన్నారు.
గతంలో.. సెల్‌ఫోన్లలో..
విదేశాల్లో 112ను ఎమర్జెన్సీ నంబర్‌గా వినియోగిస్తారు. అమెరికాలో 911 మాదిరిగానే.. చాలా దేశాలు 112ను అత్యవసర సేవలకు కేటాయించాయి. భారత్‌లో సెల్‌ఫోన్లు పరిచమైన 1997-98 నుంచి కూడా 2జీ, స్మార్ట్ ఫోన్లలో కూడా 112ను డీఫాల్ట్‌గా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించారు. అయితే.. అప్పట్లో ఆ నంబర్‌కు పొరపాటున డయల్ అయినా.. ‘సర్వీస్ నాట్ అవైలబుల్’ అని వచ్చేది. మూడేళ్ల క్రితం నుంచి భారత్‌లో విక్రయాలు సాగించే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 112కు డయల్ చేసినా.. డయల్-100కు వెళ్లేలా మార్పులు చేశాయి. కేంద్ర ప్రభుత్వం 112 యాప్ సేవలను ప్రారంభించాక.. స్మార్ట్‌ఫోన్లలోని ఆ ఫీచర్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News