‘వక్ఫ్’ సవరణను వ్యతిరేకిస్తూ నేడు బహిరంగ సభ
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:24 AM
వక్ఫ్‌సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన బహిరంగసభ నిర్వహించనున్నారు.
దారుల్‌సలాం మైదానంలో ఏర్పాట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇందుకోసం దారుల్‌సలాంలోని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయ మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ సభలో ముస్లిం మత సంస్థల నాయకులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వైసీపీపార్టీల ప్రతినిధులు ప్రసంగించనున్నారు. కాగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జులై 7వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐఎంపీఎల్‌బీ పిలుపునిచ్చింది.