AI: బీఏలోనూ కృత్రిమ మేధ
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:49 AM
ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అత్యాధునిక టెక్నాలజీ సబ్జెక్టులు ఇకపై సాధారణ డిగ్రీలోని ఆర్ట్స్, కామర్స్, సోషల్ సైన్సెస్ విభాగాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు కూడా..
సిలబస్ మార్చాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అత్యాధునిక టెక్నాలజీ సబ్జెక్టులు ఇకపై సాధారణ డిగ్రీలోని ఆర్ట్స్, కామర్స్, సోషల్ సైన్సెస్ విభాగాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) స్థాయిలో అన్ని ఆర్ట్స్, కామ ర్స్, సైన్స్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగాలకు సంబంధించి కొత్త సిలబ్‌సను రూపొందించాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. దీనికోసం వేర్వేరు యూజీ కోర్సులకు ప్రత్యేకంగా కమిటీలను వేశారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన స మావేశంలో ఆర్ట్స్ కోర్సుల సిలబస్ మార్పుపై ప్రధానంగా చర్చించారు.
ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. బీఏ ప్రస్తుత సిలబ్‌సలో 20ు-30ు పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించారు. వీటిస్థానంలో కృత్రిమ మేధ(ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ పాఠ్యాంశాలను చేర్చనున్నారు. బీఏ(ఆనర్స్) లాంటి సాహిత్య ప్రధానమైన కోర్సుల్లోనూ ఈ టెక్నాలజీ సబ్జెక్టులను తప్పనిసరి చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సిలబస్ మార్పు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.