Share News

రేవంత్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు: అడ్లూరి

ABN , Publish Date - May 24 , 2025 | 03:37 AM

దేశంలోనే గొప్ప సీఎంగా రేవంత్‌ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో ఆయనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆరోపించారు.

రేవంత్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు: అడ్లూరి

హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): దేశంలోనే గొప్ప సీఎంగా రేవంత్‌ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో ఆయనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు ఈడీ చార్జ్‌షీట్‌లో సీఎం రేవంత్‌ పేరుందంటూ తెగ హడావుడి చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ మీడియా హాల్లో ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన మాట్లాడారు.


పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ నేతలే దగ్గరుండి ఓట్లు వేయించారని, ఆ పార్టీ రజతోత్సవ సభలో బీజేపీపైన కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మట్లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్‌ వైపే నిలబడతారని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో నిజమైన మాదిగలకు స్థానం కల్పించాలని మందుల సామేలు అన్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరామని, పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, మీనాక్షీ నటరాజన్‌లనూ కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.

Updated Date - May 24 , 2025 | 03:37 AM