Share News

Celebrity Controversy : రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో తెరపైకి ఆర్జే శేఖర్‌ బాషా!

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:05 AM

తనతో సహజీవనం చేసి.. పెళ్లి కూడా చేసుకున్న సినీనటుడు రాజ్‌తరుణ్‌ తనను వదిలేయడానికి డ్రగ్స్‌ పెడ్లర్‌ రావి మస్తాన్‌ సాయి ‘అరాచకమే’ కారణం అని మొదట్నుంచీ గగ్గోలు పెడుతున్న లావణ్య, ఇందుకు సంబంధించిన ఆధారంగా ఓ ‘కీలక ఆడియో’ను బయటపెట్టింది. రాజ్‌తరుణ్‌కు పరిచయస్తుడు,

Celebrity Controversy : రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో  తెరపైకి ఆర్జే శేఖర్‌ బాషా!

ఆమెను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు మస్తాన్‌ సాయితో కలిసి పథకం

లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గుట్టుగా 150 గ్రాముల డ్రగ్స్‌ పెట్టేందుకు ప్లాన్‌

మస్తాన్‌-శేఖర్‌ మాట్లాడుకున్నట్లుగా చెబుతున్న ఆడియోను పోలీసులకు అందజేసిన లావణ్య

శేఖర్‌ బాషాని కూడా అదుపులోకి తీసుకునే చాన్స్‌.. బయటపడుతున్న మస్తాన్‌ ఘోరాలు

300 మంది యువతుల వీడియోలు!.. మస్తాన్‌ను వారం కస్టడీకి అనుమతించాలని పిటిషన్‌

హైదరాబాద్‌ సిటీ, గుంటూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తనతో సహజీవనం చేసి.. పెళ్లి కూడా చేసుకున్న సినీనటుడు రాజ్‌తరుణ్‌ తనను వదిలేయడానికి డ్రగ్స్‌ పెడ్లర్‌ రావి మస్తాన్‌ సాయి ‘అరాచకమే’ కారణం అని మొదట్నుంచీ గగ్గోలు పెడుతున్న లావణ్య, ఇందుకు సంబంధించిన ఆధారంగా ఓ ‘కీలక ఆడియో’ను బయటపెట్టింది. రాజ్‌తరుణ్‌కు పరిచయస్తుడు, బిగ్‌బాస్‌ ఫేం అయిన ఆర్జే శేఖర్‌ బాషా సహకారంతో మస్తాన్‌ సాయి తనను అన్యాయంగా డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి.. అక్కడ మత్తు పదార్థాలు దొరికేలా చేసేందుకు పథకం వేశారనీ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి మస్తాన్‌ సాయి-శేఖర్‌ బాషా మాట్లాడుకున్నట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను పోలీసులకు ఆమె అందజేసింది. యువతులు, వివాహితలకు డ్రగ్స్‌ అలవాటు చేసి.. ఆ మత్తులో ఉన్న వారిపై అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను చిత్రీకరించి.. ఆ వీడియోలతో బాధితులను మస్తాన్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడుతున్నాడంటూ ఆమె ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాన్‌ చేతిలో వందల మంది మహిళలు మోసపోయారని చెబుతూ దీనికి ‘ఆధారం’గా ఓ హార్డ్‌డి్‌స్కను సోమవారమే ఆమె పోలీసులకు అందజేసింది. ఆ హార్డ్‌ డిస్క్‌లో 300 మంది యువతులకు సంబంధించిన అశ్లీల/నగ్న వీడియోలున్నట్లు సమాచారం. మంగళవారం కూడా లావణ్య తన న్యాయవాదితో కలిసి నార్సింగ్‌ పోలీస్‌ స్టేసన్‌కు వెళ్లింది. తనను డ్రగ్స్‌ కుంభకోణంలో ఇరికించేందుకు మస్తాన్‌-శేఖర్‌ పథకం వేశారని.. దీనిపై ఇద్దరూ మాట్లాడుకున్నారని చెబుతూ ఓ ఆడియో క్లిప్‌ను పోలీసులకు అందజేసింది.


లావణ్య ఇంట్లో ఓ పార్టీని ఏర్పాటు చేసి.. తాను చెప్పిన మరో యువతిని కూడా అక్కడికి పిలిపించి.. ఇంట్లో 150 గ్రాముల డ్రగ్స్‌ (ఎండీఎంఏ) పెట్టాలని, తర్వాత పోలీసులకు సమాచారమిస్తే అంతా వారే చూసుకుంటారని మస్తాన్‌కు శేఖర్‌ బాషా చెబుతున్నట్లుగా ఆ ఆడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. లావణ్యపై పగ తీర్చుకునేందుకు, ఆమెను విల్లా నుంచి ఖాళీ చేయించేందుకు ఇదంతా శేఖర్‌ బాషా వేసిన పథకం అని లావణ్య తరఫు న్యాయవాది ఆరోపించారు. కాగా ఈ ఆడియో క్లిప్‌, లావణ్య ఇంట్లో మస్తాన్‌ వదిలేసిన ఫోన్లో లభ్యమైనట్లు చెబుతున్నారు. అయితే.. లావణ్య ఇంట్లో పెట్టాల్సిన డ్రగ్స్‌ను వారు ఎక్కడి నుంచి తేవాలనుకున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. లావణ్య ఫిర్యాదు మేరకు సోమవారమే మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. తాజాగా శేఖర్‌ బాషాపై ఆరోపణలు రావడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. కాగా లావణ్య అందజేసిన హార్డ్‌డి్‌స్కకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. మస్తాన్‌ పథకం ప్రకారమే అమ్మాయిలను పార్టీలకు పిలిచి.. వారికి డ్రగ్స్‌ అలవాటు చేసి.. ఆ తర్వాత వారిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి దాచుకున్నట్లుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్‌కు సినీ పరిశ్రమలో ఎవరెవరితో సంబంధాలున్నాయి? అతడికి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి అందుతున్నాయి? తదితర విషయాల్లో దర్యాప్తు కోసం మస్తాన్‌ను వారం రోజుల పోలీసు కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేశారు. అతడిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని నేరాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా లావణ్య ఇంట్లోంచి ఆమె ల్యాప్‌టా్‌పను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌డి్‌స్కను, ల్యాప్‌టా్‌పను, మస్తాన్‌ ఫోన్లోని ఆడియో సంభాషణలను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

’..ఉల్టా తానే చస్తానని బెదిరింపులు

పోలీసుల విచారణలో మస్తాన్‌ సాయి గురించి విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. యువతుల విషయంలో అతడు సైకోగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. ప్రేమ.. పెళ్లి పేరుతో కొందరిని.. డ్రగ్స్‌ ఎరవేసి ఇంకొందరిని.. డబ్బు ఆశపెట్టి మరికొందరిని.. ఇలా ఎంతోమంది యువతులను లోబర్చుకొని ఆ దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించినట్లు తెలిసింది. బాధితులకు ఫోన్‌చేసి చేసి అశ్లీల దృశ్యాలను పోర్న్‌సైట్లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని సమాచారం. ఈ క్రమంలో యువతులతో తన ఫోన్‌ సంభాషణలనూ రికార్డు చేసుకొని హార్డ్‌డి్‌స్కలో మస్తాన్‌ దాచుకునేవాడు. అయితే అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకొని బాధిత యువతులను బ్లాక్‌మెయిల్‌ చేసే మస్తాన్‌ సాయి, వారిలో ఎవరైనా తనపై తిరగబడితే ఉల్టా వారినే బెదిరించేవాడు. తనకు వ్యతిరేకంగా బాధిత యువతుల్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలిస్తే.. వారికి అతడు వీడియో కాల్‌ చేసేవాడు. ఫిర్యాదు చేస్తే గనక తాను ఆత్మహత్య చేసుకుంటానని.. అందుకు మీరే కారణం అని రాసి మరీ చస్తానని బాధితులను బెదిరించేవాడు. దీంతో.. అతడు చస్తే.. తమ పేర్లు బయటకొచ్చి.. పరువు పోతుందనే భయంతో ఎంతోమంది బాధితులు ఫిర్యాదుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. కాగా మస్తాన్‌లాంటి సైకోలకు తక్షణమే శిక్ష పడాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:05 AM