Aadi Srinivas: ఢిల్లీలో దీక్ష చేయడానికి కవితకు ఎందుకు భయం? : ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:16 AM
బీసీ బిల్లులపై ఢిల్లీలో దీక్ష చేయడానికి కవిత ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీకి లాభం చేయడానికే కవిత.. ఢిల్లీలో కాకుండా ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నారన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): బీసీ బిల్లులపై ఢిల్లీలో దీక్ష చేయడానికి కవిత ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీకి లాభం చేయడానికే కవిత.. ఢిల్లీలో కాకుండా ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్నా చేయడానికి తాము ఢిల్లీకి వెళ్తుంటే.. దీక్ష పేరుతో ఇక్కడ ఆమె కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీల పట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే తన తండ్రి కేసీఆర్‌తో కలిసి ఢిల్లీలో దీక్ష చేపట్టాలని హితవు పలికారు. కవిత చేపట్టిన దీక్షకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుందా అని ప్రశ్నించారు. దీక్షకు ముందు కవిత కేసీఆర్ ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
అనర్హతపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎ్‌సకు లేదు
ఎమ్మెల్యేల అనర్హతపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎ్‌సకులేదని, వారి వల్ల అసెంబ్లీలోని గాంధీ విగ్రహం అపవిత్రమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మధుసూదన్‌రెడ్డి అన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ టికెట్లపై గెలిచి బీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్‌రెడ్డి వంటి వాళ్లు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొనడం పరాకాష్ఠ అన్నారు. పదేళ్లు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌లు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్టీలను విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News