Share News

Hyderabad: 90 ఏళ్ల వృద్ధురాలికి ఎంత కష్టం!

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:19 AM

ఆ కుమారులకు తల్లే భారమైంది! వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అన్నీతామై అవసరాలు తీర్చి.. అప్యాయంగా చూసుకోవాల్సిందిపోయి ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారు.

Hyderabad: 90 ఏళ్ల వృద్ధురాలికి ఎంత కష్టం!

  • ఆమెను ఇంట్లోంచి గెంటేసిన కుమారులు

  • ఆ ఇల్లు తనకే దక్కాలని వృద్ధురాలి ఫిర్యాదు

చాదర్‌ఘాట్‌, జూన్‌26 (ఆంధ్రజ్యోతి): ఆ కుమారులకు తల్లే భారమైంది! వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అన్నీతామై అవసరాలు తీర్చి.. అప్యాయంగా చూసుకోవాల్సిందిపోయి ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారు. తొంభై ఏళ్ల వయసులో ఆమె ఎక్కడికని వెళ్లగలదు? తన భర్త కట్టిన ఆ ఇంట్లో కడదాకా ఉండే హక్కు తనకు ఉందని, తన బాగోగులు చూడని కుమారులు తన ఇంట్లో ఉండొద్దంటూ పోరాడుతోంది. మలక్‌పేట ముసారాంబాగ్‌కు చెందిన శకుంతలా బాయి(90) దీనగాథ ఇది. ఆమె భర్త చాలా కాలం క్రితమే మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. కుమారులతో కలిసి ఆమె తన ఇంట్లోనే ఉంటున్నారు. కొన్నాళ్ల పాటు తల్లిని బాగానే చూసుకున్న ఆ కుమారులు, ఆ తర్వాత నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.


ఇటీవల ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. అప్పటి నుంచి ఆమె సైదాబాద్‌లో నివాసముంటున్న చిన్న కూతురు వద్ద ఉంటున్నారు. తన ఇంటిని తనకు అప్పగించాలంటూ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ప్రతినిధులతో కలిసి ఆమె 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ జిల్లా ఆర్డీవోను ఆశ్రయించారు. ఆర్డీవో.. వృద్ధురాలి కుమారులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇంటిని తన తల్లికి అప్పగిస్తామంటూ ఆర్డీవో ముందు అంగీకరించినా వారు ఆ పని చేయలేదు. దీంతో ఇంటిని రెండు రోజుల్లో ఖాళీ చేయకపోతే సీజ్‌ చేస్తామని వారికి సైదాబాద్‌ తహసీల్దార్‌ జయ ఫైనల్‌ నోటీసు ఇచ్చారు. గడువు ముగియడంతో జయశ్రీ సిబ్బందితో కలిసి గురువారం శకుంతల బాయి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె కుమారులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 03:19 AM