Deputy Collectors: 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:45 AM
రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
ఏసీబీ కేసులున్నా, రాజీనామా చేసినా ప్రమోషన్లు ఇచ్చారంటూ అభ్యంతరాలు
రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. వీరంతా 2005లో ఎపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా నియామకమైన ఉద్యోగులు. 2008లో తహసీల్దార్లుగా పదోన్నతి పొందారు. 2014లో కొంతమంది, 2017లో మరికొందరు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. మొత్తం 189 మందిలో ఇప్పుడు 44 మందికి స్పెషల్ గ్రేడ్ హోదాతో పదోన్నతి ఇచ్చారు. అయితే దీనిపై పదోన్నతి లభించని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘించారని, అర్హులను పక్కనపెట్టి అనర్హులకు పదోన్నతులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇందులో ఉద్యోగానికి రాజీనామా చేసి, నాలుగేళ్లకు పైగా విధులకు దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నారని పేర్కొంటున్నారు. డిప్యూటీ కలెక్టర్లుగా మూడేళ్ల సర్వీసు పూర్తి చేయనివారికి, ఆరోపణలు ఉన్నవారికీ పదోన్నతులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News