Share News

Siddipet: ఆట వస్తువు పిన్ను గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

ABN , Publish Date - May 19 , 2025 | 04:43 AM

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆట వస్తువును మింగడంతో ఊపిరాడక 14 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలో ఆదివారం జరిగింది.

Siddipet: ఆట వస్తువు పిన్ను గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

  • వర్గల్‌ మండలం నాచారంలో ఘటన

వర్గల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆట వస్తువును మింగడంతో ఊపిరాడక 14 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలో ఆదివారం జరిగింది. నాచారం గ్రామానికి చెంది న నర్సింహులు వద్ద హరియాణాకు చెందిన షోయబ్‌ఖాన్‌ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య నదియా, కూతురు అనబియా, కుమారుడు ఉన్నారు.


అనబియా శనివారం ఇంటివద్ద బొమ్మలతో ఆడుకుంటూ బొమ్మకు ఉన్న ఓ పిన్నును మింగింది. దాంతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.


ఈ వార్తలు కూడా చదవండి

Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:43 AM