మార్చి 6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:21 AM
పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. మార్చి 15తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్..
పరీక్షల ముందు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తొలగించడానికి అధికారులు ఉచిత కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. వారి కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు 14416 లేదా 1800914416 టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు