Engineering Colleges: 171 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,07,218 సీట్లు
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:37 AM
రాష్ట్రంలోని 171 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1,07,218 సీట్లను భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. వీటిలో కన్వీనర్ కోటా కింద 76,795 సీట్లను భర్తీ చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
కన్వీనర్ కోటాలో 76,795 సీట్ల భర్తీ
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రేపే ఆఖరు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 171 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1,07,218 సీట్లను భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. వీటిలో కన్వీనర్ కోటా కింద 76,795 సీట్లను భర్తీ చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీల వారీగా కాలేజీల్లో భర్తీ చేసే సీట్ల వివరాలతో పాటు ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లున్నాయన్న వివరాలతో జాబితాను విడుదల చేసింది. కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 95,654 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారని, ఇప్పటివరకు 76,494 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైనట్టు తెలిపారు. కాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జూలై 8 ఆఖరు తేదీగా ప్రకటించారు. ఇక ఆప్షన్ల కోసం జూలై 6 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. కాగా 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలోని 21 కళాశాలల్లో 5,808 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. వీటిలో ఈ ఏడాది కొత్తగా పాలమూరు (180), శాతవాహన (240), ఎర్త్‌సైన్స్ (300) యూనివర్సిటీల పరిధిలో కలిపి 720 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రెండు ప్రైవేటు యూనివర్సిటీల పరిధిలోని 2 కాలేజీల్లో 1,800 సీట్లుండగా.. వాటిలో 1,260 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.
సీఎస్‌ఈలో 26,150 సీట్లు...
రాష్ట్రంలోని ఓయూ, జేఎన్‌టీయూహెచ్, కేయూ పరిధిలో మొత్తం 171 కాలేజీలుండగా.. ఓయూ పరిధిలో 14, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 130, కేయూ పరిధిలో 4, ప్రైవేటు యూనివర్సిటీల పరిధిలో 23 కాలేజీలున్నాయి. వీటన్నింటిలో కలిపి 1,07,218 సీట్లుండగా.. 76,795 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. అన్ని కాలేజీల్లో కలిపి 47 బ్రాంచీలున్నాయి. అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ) 26,150 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్)లో 12,495, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో 10,125, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో 6,996, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్‌లో 4,301, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3,681, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2,994, సివిల్ ఇంజనీరింగ్‌లో 3,129, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్‌లో 1,235, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యురిటీస్) 1,439 సీట్లుండగా.. మిగిలిన అన్ని బ్రాంచీల్లో ఒక్కో దానిలో వెయ్యిలోపే సీట్లున్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ (ఎంఎంఎస్), బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ (ఎంటీఈ) బ్రాంచీల్లో ఒక్కోదానిలో అతి తక్కువగా 30 చొప్పున సీట్లున్నాయి. డెయిరీంగ్ బ్రాంచీలో 23 సీట్లుండగా ఎలక్ట్రానిక్స్ అండ్‌టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో అతి తక్కువగా 21 సీట్లే ఉన్నాయి.
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News