Share News

Medak: అంతుచిక్కని వ్యాధితో 10 వేల కోళ్లు మృతి

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:28 AM

మెదక్‌ జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధితో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Medak: అంతుచిక్కని వ్యాధితో 10 వేల కోళ్లు మృతి

  • చిన్నశంకరంపేట మండలంలో ఘటన

చిన్నశంకరంపేట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. వైరస్‌ సోకడంతో వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని వాటి పోషణదారులు సంగెం జనార్ధన్‌, ఆరె యాదగిరి, మినిపూరి భూపాల్‌రెడ్డి వాపోయారు.

మెదక్‌ జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధితో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Updated Date - Mar 09 , 2025 | 04:28 AM