Share News

Whatsapp Arattai Chat Export: అరట్టైకి వాట్సాప్ చాట్‌ను ఎక్స్‌‌పోర్టు చేయాలా.. ఇలా చేస్తే నిమిషాల్లో పని పూర్తి

ABN , Publish Date - Oct 06 , 2025 | 10:06 PM

అరట్టైకి వాట్సాప్ చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేయాలని అనుకుంటున్నారా? ఇలా చేస్తే నిమిషాల్లో మీ పని పూర్తవుతుంది. మరి చాట్ ఎక్స్‌పోర్టు ఎలా చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Whatsapp Arattai Chat Export: అరట్టైకి వాట్సాప్ చాట్‌ను ఎక్స్‌‌పోర్టు చేయాలా.. ఇలా చేస్తే నిమిషాల్లో పని పూర్తి
WhatsApp to Arattai Chat Export

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారతీయుల దృష్టి అరట్టై మెసేజింగ్ యాప్ వైపు మళ్లింది. ఈ దేశీయ యాప్‌కు భారత ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తోంది. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది గర్వించదగ్గ విషయమని కామెంట్ చేశారు. ఇక వాట్సాప్‌ నుంచి అరట్టైకి మళ్లాలనుకునే వారు తమ చాట్స్‌ను సులువగా ఈ దేశీ యాప్‌కు ఎక్స్‌పోర్టు చేసుకోవచ్చు. ఇదెలాగో తాజా కథనంలో తెలుసుకుందాం (WhatApp Chat Export to Arattai).

వాట్సాప్ చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేసుకునేందుకు ముందుగా అరట్టై యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత అరట్టైకి ఫోన్‌లోని మన కాంటాక్ట్స్ అన్నీ అందుబాటులో ఉంచాలి. అంటే.. వాటి యాక్సెస్‌ను అరట్టైకి ఇవ్వాలి. ఆ తరువాత వాట్సాప్ ప్రొఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి ఎక్స్‌పోర్టు చాట్‌ను ఎంచుకోవాలి. ఏ వ్యక్తి చాట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి. అటాచ్ మీడియా ఆప్షన్‌ను ఎంచుకుంటే ఫొటోలు, వీడియోలను కూడా ఎక్స్‌పోర్టు చేయొచ్చు. ఆ తరువాత ఆప్షన్స్‌లోని అరట్టైని ఎంచుకుంటే చాట్ సులువుగా బదిలీ అయిపోతుంది. అయితే. ఈ చాట్‌ల బదిలీ విజయవంతంగా పూర్తి కావాలంటే మీరు ఎంచుకున్న వ్యక్తి కూడా అరట్టైలో ఉండాలి.


అయితే, ఇలా చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేసే ముందు వాట్సాప్ బ్యాకప్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. జీమెయిల్‌లో కూడా వీటిని బ్యాకప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వ్యక్తి చాట్‌ను జీమెయిల్‌కు పంపించేందుకు ముందుగా సదరు వ్యక్తి కాంటాక్ట్‌లోకి వెళ్లి ఎక్స్‌పోర్టు చాట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో జీమెయిల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో, ఈ చాట్ మొత్తం జీమెయిల్‌కు బదిలీ అయిపోతుంది. ఆ తరువాత దీన్ని కంప్యూటర్ లేదా, మొబైల్ ఫోన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తమిళనాడుకు చెందిన జోహో కార్పొరేషన్ అరట్టైని రూపొందించిన విషయం తెలిసిందే. దీంతో, పాటు బిజినెస్ అవసరాల కోసం అనేక సాఫ్ట్‌వేర్‌లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అకౌంటింగ్, మార్కెటింగ్, మానవవనరుల విభాగాలకు సంబంధించి అవసరాల కోసం పలు యాప్స్‌ను సిద్ధం చేసింది. అనేక సంస్థలు ఇప్పటికే జోహో సూట్స్‌ను వినియోగిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా

వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..

Read Latest and Technology News

Updated Date - Oct 06 , 2025 | 10:06 PM