Share News

US Open 2025: జ్వెరెవ్‌ అవుట్‌

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:32 AM

యూఎస్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌కు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-7 (7/9), 4-6, 4-6తో 25వ సీడ్‌ ఫిలిక్స్‌ అలియసిమ్‌ (కెనడా) చేతిలో ఓడాడు....

US Open 2025: జ్వెరెవ్‌ అవుట్‌

  • ప్రీక్వార్టర్స్‌కు సినర్‌, స్వియటెక్‌

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌కు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-7 (7/9), 4-6, 4-6తో 25వ సీడ్‌ ఫిలిక్స్‌ అలియసిమ్‌ (కెనడా) చేతిలో ఓడాడు. 2018 తర్వాత జ్వెరెవ్‌ నాలుగో రౌండ్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. ఇక ఆదివారం తెల్లవారుజామున ముగిసిన మూడో రౌండ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ యానిక్‌ సినర్‌ 5-7, 6-4, 6-3, 6-3తో షపోవలోవ్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరాడు. మరో మ్యాచ్‌లో రుబ్లెవ్‌ 2-6, 6-4, 6-3, 4-6, 6-3తో కొలెమాన్‌ వాంగ్‌పై పోరాడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ స్వియటెక్‌ 7-6, 6-4తో అన్నా కలిన్‌స్కయపై, నాలుగో సీడ్‌ జెస్సికా పెగుల 6-1, 6-1తో ఆన్‌ లీపై, 8వ సీడ్‌ ఎనిమిసోవా 6-4, 4-6, 6-2తో క్రిస్టియాన్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు.

రెండో రౌండ్‌లో యుకీ జోడీ: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలిరౌండ్లో రోహన్‌ బోపన్న/అర్నెడో జంట ఓడగా.. యుకీ భాంబ్రీ/మైకేల్‌ వీనస్‌ జంట ప్రత్యర్థిని ఓడించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:32 AM