Share News

Womens ODI World Cup 2025: కప్పు కొడితే రూ 39.55 కోట్లు

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:01 AM

Womens ODI World Cup Prize Money Surges to rupees 39 Crores 55 lakhs for Champions

Womens ODI World Cup 2025: కప్పు కొడితే రూ 39.55 కోట్లు

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌

ప్రైజ్‌మనీ భారీగా పెంపు

దుబాయ్‌: మహిళల వన్డే ప్రపంచ కప్‌ విజేత ప్రైజ్‌మనీని ఐసీసీ ఊహించని మొత్తానికి పెంచింది. చాంపియన్‌గా నిలిచే జట్టు ఏకంగా రూ. 39.55 కోట్లు అందుకోనుంది. గత మెగా టోర్నీలో విజేతకు రూ. 11.65 కోట్లు దక్కగా.. అంతకు మూడు రెట్లకు పైగా మొత్తం ఈసారి చాంపియన్‌కు దక్కనుంది. ఇక, రన్నర్‌పగా నిలిచే జట్టుకు రూ. 19.77 కోట్లు (గతసారి రూ. 5.30 కోట్లు) లభించనున్నాయి. భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్‌ కప్‌ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు మెగా టోర్నమెంట్‌ బరిలో దిగుతున్నాయి. చాంపియన్‌షిప్‌ ప్రైజ్‌మనీ దాదాపు రూ. 122.5 కోట్లు కావడం విశేషం. కిందటి టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 31 కోట్ల కంటే ఇది 297 శాతం అధికం. ఇంకా.. 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 88.26 కోట్లకన్నా.. మహిళల మెగా టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ ఎంతో ఎక్కువ. అలాగే పురుషుల టోర్నీ విజేత జట్టుకు దక్కింది రూ. 35.31 కోట్లే.


ప్రైజ్‌మనీ ఇలా..

  • విజేతకు- రూ.39.55 కోట్లు

  • రన్నరప్‌నకు - రూ. 19.77 కోట్లు

  • సెమీఫైనలి్‌స్టలకు - రూ.9.89 కోట్లు చొప్పున

  • ఐదు, ఆరు స్థానాల జట్లకు - రూ.6.16 కోట్లు చొప్పున

  • ఏడు, ఎనిమిది స్థానాల జట్లకు - రూ. 2.46 కోట్లు చొప్పున

  • గ్రూప్‌ దశలో ఒక్కో విజయానికి - రూ. 30.29 లక్షలు

  • పాల్గొన్న ప్రతి జట్టుకు- అదనంగా రూ. 2.20 కోట్లు

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 05:01 AM