Share News

West Indies Follow On: కుప్పకూలిన విండీస్.. ఫాలో ఆన్ ఇచ్చిన గిల్!

ABN , Publish Date - Oct 12 , 2025 | 02:51 PM

భారత్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ మరోసారి విఫలమైంది. ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది.

West Indies Follow On: కుప్పకూలిన విండీస్.. ఫాలో ఆన్ ఇచ్చిన గిల్!
West Indies Follow On

అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఢిల్లీ వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఫాలో ఆన్ లో పడింది. స్పిన్ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై టీమిండియా బౌలర్లు అదరగొట్టేశారు. ఓవర్ నైట్ 140/4 స్కోరుతో మూడో రోజు ఆటను కరేబియన్ జట్టు ప్రారంభించింది. కుల్‌దీప్‌ యాదవ్ (5/82) స్పిన్ మాయాజాలంకి ప్రత్యర్థి కుదేలైంది. అతికష్టం మీద చివరికి 248 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్‌’ నుంచి తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా విండీస్ జట్టుకు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.


మూడో రోజు ఆట తొలి సెషన్‌లో 8 వికెట్లు పడటంతో లంచ్ బ్రేక్ కు ముందే విండీస్‌(West Indies) ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ, పియరీ - ఫిలిప్‌ జోడీ దాదాపు 16 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో లచ్ బ్రేక్ వచ్చింది. అనంతరం రెండో సెషన్‌ తొలి ఓవర్‌లోనే పియరీని బుమ్రా క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీలెస్ (13)తో కలిసి ఫిలిప్‌ (24*) భారత బౌలర్లను కాసేపు విసిగించాడు. చివరకు కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav) సీల్స్‌ను ఔట్ చేసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.


మొత్తంగా కుల్దీప్(Kuldeep Yadav) 5 వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా 3.. సిరాజ్, బుమ్రా చెరొకటి తీశారు. ఈ క్రమంలో కుల్దీప్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్లలో అత్యధిక ‘ఫైఫర్’ (ఐదు వికెట్లు) తీసిన భారత బౌలర్‌గా(India Bowler) కుల్‌దీప్‌ నిలిచాడు. అంతర్జాతీయంగానూ తక్కువ మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌ కూడా కుల్‌దీప్‌(15 టెస్టుల్లో ఐదు సార్లు) కావడం గమనార్హం. జానీ వార్డ్‌లే 28 టెస్టుల్లో 5సార్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి

Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!

India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో

Updated Date - Oct 12 , 2025 | 03:33 PM