West Indies Test Squad 2025: భారత్‌తో టెస్టులకు విండీస్ జట్టు ఇదే
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:52 AM
రెండు టెస్టుల సిరీస్ కోసం వచ్చేనెలలో భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్ టెస్టు జట్టును ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లో తొలి టెస్టు, ఢిల్లీ వేదికగా 10 నుంచి...
న్యూఢిల్లీ: రెండు టెస్టుల సిరీస్ కోసం వచ్చేనెలలో భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్ టెస్టు జట్టును ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లో తొలి టెస్టు, ఢిల్లీ వేదికగా 10 నుంచి 14 వరకు రెండో టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కోసం మంగళవారం ప్రకటించిన 15 మందితో కూడిన విండీస్ జట్టులో సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ బ్రాత్‌వైట్‌కు చోటు దక్కలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఖారీ పియరీ తొలిసారి జట్టుకు ఎంపికవగా.. టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్‌లను మళ్లీ జట్టులోకొచ్చారు. రోస్టన్ చేజ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
విండీస్ జట్టు: రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వికెట్ కీపర్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ క్యాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడన్ సీల్స్.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి