Share News

Virat Kohli Returns to India: విరాట్‌ వచ్చేశాడు

ABN , Publish Date - Oct 15 , 2025 | 02:53 AM

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ నాలుగు నెలల విరామానంతరం భారత్‌ తిరిగొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును విజేతగా నిలబెట్టిన విరాట్‌..

Virat Kohli Returns to India: విరాట్‌ వచ్చేశాడు

న్యూఢిల్లీ: స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ నాలుగు నెలల విరామానంతరం భారత్‌ తిరిగొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును విజేతగా నిలబెట్టిన విరాట్‌.. ఆ లీగ్‌ ముగిసిన వెంటనే భార్య అనుష్క, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌ వెళ్లిపోయాడు. ఇన్నాళ్లూ కుటుంబంతో కలిసి అక్కడే ఉన్న కోహ్లీ, ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీ్‌సకు జట్టుతో కలిసి వెళ్లేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నాడు. రోహిత్‌, మరికొందరు ఆటగాళ్లతో కలిసి విరాట్‌ బుధవారం ఢిల్లీ నుంచి పెర్త్‌ వెళ్లనున్నాడు. కాగా, రెండు బృందాలుగా టీమిండియా సభ్యులు ఆస్ట్రేలియా వెళ్లనున్నట్టు బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 02:54 AM