Virat Kohli: రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:39 PM
2025 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు టైటిల్ గెల్చుకోవడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక ప్రకటన చేశాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్లో నిన్న పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఆర్సీబీ మ్యాచులో ఆఖరి ఓవర్ రెండో బంతి తర్వాత, విరాట్ కోహ్లీ(Virat Kohli) భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అది చూసిన కోట్లాది మంది అభిమానులు ఎమోషన్ అయ్యారు. జోష్ హాజిల్‌వుడ్ బంతిని విసురుతుండగా, కోహ్లీ మైదానాన్ని ముద్దాడిన క్షణం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎందుకంటే 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, బెంగళూరు జట్టు ఎట్టకేలకు మొదటి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో కోహ్లీ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అభిమానులకు అంకితం
ఆ తర్వాత భార్య అనుష్కను హత్తుకుని విరాట్ తన మనసులోని విషయాలను పంచుకున్నాడు. ఈ గెలుపు అభిమానులది కూడా అని పేర్కొన్నాడు. 18 ఏళ్లుగా ఈ జట్టు కోసం తన యవ్వనాన్ని, శక్తిని అంకితం చేసినట్లు చెప్పాడు. ప్రతి సీజన్‌లో జట్టు గెలుపు కోసం కష్టపడినట్లు వెల్లడించాడు. అదే సమయంలో బెంగళూరు జట్టుకు సహచరుడైన ఏబీ డివిలియర్స్‌కు కోహ్లీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఏబీ కూడా ఆర్సీబీ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఒడీఐ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను. కానీ ఈ ఐపీఎల్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకమని, చివరి వరకు ఇదే జట్టుతో ఉంటనన్నాడు కోహ్లీ.
కెరీర్ గురించి కోహ్లీ
క్రీడాకారుడిగా మా కెరీర్‌కు కూడా ఒక ముగింపు ఉంటుందన్నాడు విరాట్. అందుకే ప్రతి రోజు నేను నా శక్తిని పూర్తిగా వినియోగించాలనుకుంటాను. నేను నా వంతు పోరాడానని అనిపించాలి. ఇంపాక్ట్ ప్లేయర్ కాదు, ఫుల్ ప్లేయర్‌గా ఉండాలి. కొన్ని జట్లు తమ సీనియర్ ఆటగాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, కోహ్లీ మాత్రం పూర్తి సమయ ఆటగాడిగా మైదానంలో ఉండాలని అంటున్నాడు.
రిటైర్మెంట్ గురించి...
నేను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే ఆడే ఆటగాడిని కాదు. 20 ఓవర్లంతా ఫీల్డింగ్ చేయాలి, మైదానంలో ఉండాలని పేర్కొన్నాడు కోహ్లీ. ఈ ప్రకటన ప్రకారం చూస్తే మాత్రం విరాట్ మరికొన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడేలా ఉన్నాడు. ఎందుకంటే తన వయస్సు ఇప్పుడు 36 ఏళ్లు మాత్రమే. ధోనితో 43 ఏళ్ల వయసుతో పోల్చుకుంటే మాత్రం విరాట్ ఇంకా ఆడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి