World Junior Badminton Championship: వెన్నెల శుభారంభం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:34 AM
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నెల శుభారంభం చేసింది. సోమవారం మొదలైన టోర్నీ వ్యక్తిగత విభాగం బాలికల సింగిల్స్‌లో వెన్నెల...
ప్రపంచ జూ.బ్యాడ్మింటన్
గువాహటి: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నెల శుభారంభం చేసింది. సోమవారం మొదలైన టోర్నీ వ్యక్తిగత విభాగం బాలికల సింగిల్స్‌లో వెన్నెల 15-1, 15-6తో సియోఫ్రా ఫ్లిన్ (ఐర్లాండ్)పై గెలిచి రెండో రౌండ్ చేరింది. బాలుర సింగిల్స్‌లో లల్తాజువాల 15-4, 15-4తో డెనిస్ ముకాస (ఉగాండా)పై, జ్ఞాన దత్తా 5-15, 15-7, 15-7తో మిలన్ మెస్టెర్‌హాజీ (హంగేరీ)పై గెలిచి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News