Share News

ICC T20 Rankings: వరుణ్‌@1

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:45 AM

మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌ లేపాడు. బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో వరుణ్‌ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని...

ICC T20 Rankings: వరుణ్‌@1

టీ 20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం

దుబాయ్‌: మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌ లేపాడు. బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో వరుణ్‌ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఏకంగా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను అందుకొన్నాడు. ఈ క్రమంలో టాప్‌ ర్యాంక్‌ను అందుకొన్న మూడో భారత బౌలర్‌గా చక్రవర్తి నిలిచాడు. రవి బిష్ణోయ్‌ 8వ స్థానంలో, అక్షర్‌ పటేల్‌ 12వ ర్యాంక్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ ఆటగాడు జాకబ్‌ డెఫీ, వెస్టిండీస్‌ స్పిన్నర్‌ అఖిల్‌ హొసేన్‌ రెండు, మూడు ర్యాంక్‌లు దక్కించుకొన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అభిషేక్‌ శర్మ 14వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బ్యాటర్ల కేటగిరీలో అభిషేక్‌ నెం:1 ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌లు నాలుగు, ఏడో ర్యాంకుల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 05:45 AM