Vaishali Swiss Grand Prix: వైశాలి చరిత్ర సృష్టించింది
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:48 AM
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి చరిత్ర సృష్టించింది. స్విస్ గ్రాండ్ ప్రీ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకుంది. ఇక పురుషుల టైటిల్‌ను అనీష్ గిరి (నెదర్లాండ్స్-8 పాయింట్లు) అందుకున్నాడు...
టైటిల్ నిలబెట్టుకున్న భారత జీఎం
‘క్యాండిడేట్స్’కు క్వాలిఫై జూ స్విస్ గ్రాండ్ ప్రీ చెస్
సమర్‌కండ్ (ఉజ్బెకిస్థాన్): భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి చరిత్ర సృష్టించింది. స్విస్ గ్రాండ్ ప్రీ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకుంది. ఇక పురుషుల టైటిల్‌ను అనీష్ గిరి (నెదర్లాండ్స్-8 పాయింట్లు) అందుకున్నాడు. తమిళనాడుకు చెందిన వైశాలి సోమవారం ఇక్కడ జరిగిన 11వ, ఆఖరి రౌండ్‌ను ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగ్యీతో డ్రా చేసింది. దాంతో మొత్తం 8 పాయింట్లతో వైశాలి విజేతగా నిలిచింది. తద్వారా 2023లో గెలిచిన ఈ టైటిల్‌ను ఆమె నిలబెట్టుకుంది. అంతేకాదు హంపి, దివ్యాదేశ్‌ముఖ్ తర్వాత ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించిన మూడో భారత మహిళగా ఘనత సాధించింది. ఇక..ఈసారి స్విస్ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచిన లగ్నో (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖాయం చేసుకుంది. ద్రోణవల్లి హారిక (6.5) ఆఖరి రౌండ్‌లో కరీసా ఇప్‌పై నెగ్గింది. గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 11వ రౌండ్‌ను విన్సెంట్ కీమర్‌తో డ్రా చేశాడు. కీమర్‌తోపాటు రెండో స్థానంలో నిలిచిన మథియాస్ పురుషుల విభాగం నుంచి క్యాండిడేట్స్ చెస్‌కు అర్హత సాధించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News