Pro Kabaddi League: పైరేట్స్‌పై యోధాస్ గెలుపు
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:47 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్ 34-31 స్కోరుతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఆరు పాయింట్ల ఆధిక్యంతో ఉన్న పైరేట్స్...
ప్రొ కబడ్డీ లీగ్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్ 34-31 స్కోరుతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఆరు పాయింట్ల ఆధిక్యంతో ఉన్న పైరేట్స్.. ఆ తర్వాత రైడింగ్‌లో వెనుకంజలో నిలిచింది. ద్వితీయార్ధంలో అద్భుతంగా పుంజుకున్న యూపీ యోధా్‌సలో రైడర్ భవానీ రాజ్‌పుత్ వరుసగా పాయింట్లు రాబట్టి అదరగొట్టాడు. యూపీ జట్టులో గగన్ గౌడ ఏడు పాయింట్లతో టాస్ స్కోరర్‌గా నిలవగా, మరో రైడర్ భవానీ రాజ్‌పుత్ 5, డిఫెండర్లు సుమిత్ 5, అన్షు సింగ్ 5 పాయింట్లు రాబట్టారు. పైరేట్స్‌లో అయాన్ 9, మణిందర్‌సింగ్ 7 పాయింట్లు సాధించారు. రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 41-19 స్కోరుతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి