Share News

Abhishek Nayar: దీప్తిని అందుకే వదిలేశాం: అభిషేక్ నాయర్

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:30 PM

డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముందు యూపీ వారియర్స్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొత్తగా జట్టును నిర్మించేందుకు పర్సులో ఎక్కువ మొత్తం ఉంచుకోవాలనేదే తమ నిర్ణయానికి కారణమని హెడ్‌ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు.

Abhishek Nayar: దీప్తిని అందుకే వదిలేశాం: అభిషేక్ నాయర్
Abhishek Nayar

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026)కు ముందు యూపీ వారియర్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది. కేవలం ఒకే ఒక్క ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్న యూపీ వారియర్స్ మిగతా అందరినీ వదిలేసింది. ఇందులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, వన్డే ప్రపంచ కప్ 2025 విజేత దీప్తి శర్మ కూడా ఉండటం గమనార్హం. ఈ విషయంపై యూపీ వారియర్స్ హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.


‘మేము(UP Warriors) సరికొత్తగా సీజన్‌ను ఆరంభించాలని అనుకుంటున్నాం. పర్సులో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని అట్టిపెట్టుకోవాలనేదే మా ఉద్దేశం. టైటిల్ గెలవగల జట్టును తయారు చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వదిలేసినా మాకు కావాల్సిన ప్లేయర్లను వేలంలో తిరిగి సొంతం చేసుకుంటాం’ అని తెలిపాడు. అయితే 2023లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌లో ముంబై, బెంగళూరు, యూపీ, గుజరాత్, ఢిల్లీ ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి.


పర్సులో రూ.14.50కోట్లు..

నవంబర్ 27న డబ్ల్యూపీఎల్(WPL 2026) మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేశాయి. యూపీ వారియర్స్ పర్సులో రూ.14.50కోట్లు ఉన్నాయి. ఇక వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma)తో పాటు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(Lara Wolvaardt) మెగా వేలంలో భాగం కానున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన దీప్తిని యూపీ వారియర్స్ విడుదల చేయగా.. ‘టోర్నీ టాప్ స్కోరర్’ వోల్వార్ట్‌ను గుజరాత్ జెయింట్స్ జట్టు రీటెయిన్ చేసుకోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

భారత హాకీకి వందేళ్లు!

మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 02:30 PM