Share News

UAE Beat Oman: ఒమన్‌పై యూఏఈ గెలుపు

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:44 AM

కెప్టెన్‌ మహ్మద్‌ వసీం (69), అలీషాన్‌ షరాఫు (51) అర్ధ శతకాలతో రాణించడంతో.. ఆసియా కప్‌లో యూఏఈ బోణీ చేసింది. గ్రూప్‌-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో ఒమన్‌పై...

UAE Beat Oman: ఒమన్‌పై యూఏఈ గెలుపు

  • వసీం, షరాఫు అర్ధ శతకాలు

  • సూపర్‌-4కు భారత్‌

అబుధాబి: కెప్టెన్‌ మహ్మద్‌ వసీం (69), అలీషాన్‌ షరాఫు (51) అర్ధ శతకాలతో రాణించడంతో.. ఆసియా కప్‌లో యూఏఈ బోణీ చేసింది. గ్రూప్‌-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచిన యూఏఈ సూపర్‌-4 అవకాశాలను సజీవంగా నిలబెట్టుకొంది. కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే సూపర్‌-4 బెర్త్‌ను ఖరారు చేసుకొంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా నాలుగు పాయింట్లతోపాటు మెరుగైన రన్‌రేట్‌తో టాప్‌లో ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. జితెన్‌ రామనంది రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఒమన్‌ 18.4 ఓవర్లలో 130 పరుగులకు కుప్పకూలింది. ఆర్యన్‌ (24), కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (20), వినాయక్‌ శుక్లా (20) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు: యూఏఈ: 20 ఓవర్లలో 172/5 (వసీం 69, షరాఫు 51; జితెన్‌ 2/24). ఒమన్‌: 18.4 ఓవర్లలో 130 ఆలౌట్‌ (ఆర్యన్‌ 24, జతిందర్‌ సింగ్‌ 20, శుక్లా 20; జునైద్‌ 4/23).

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:44 AM