Pro Kabaddi League 2025: యు ముంబా ఉత్కంఠ గెలుపు
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:23 AM
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) తొలి అంచె లీగ్ మ్యాచ్‌లలో యు ముంబా జోరు కొనసాగుతోంది. పట్నా పైరేట్స్‌తో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 40-39 స్కోరుతో,,,
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) తొలి అంచె లీగ్ మ్యాచ్‌లలో యు ముంబా జోరు కొనసాగుతోంది. పట్నా పైరేట్స్‌తో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 40-39 స్కోరుతో విజయం సాధించింది. ప్రథమార్థం ముగిసేసరికి యు ముంబా 23-15 ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్ధం 10వ నిమిషం నుంచి ఇరు జట్లు సమాన పాయింట్లతో స్కోరు బోర్డును నడిపించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. గెలుపు అంచున ఉన్న పట్నా చివరి సెకన్లలో పొరపాట్లు చేసి చేజేతులా ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 38-28తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి