Share News

India U17 Football: అమ్మాయిలు అదే జోరు

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:15 AM

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌-17 చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిల దూకుడు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని చిత్తుచేసి హ్యాట్రిక్‌ విజయాన్నందుకున్నారు...

India U17 Football: అమ్మాయిలు అదే జోరు

  • భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

  • శాఫ్‌ అండర్‌-17 చాంపియన్‌షిప్‌

థింపూ (భూటాన్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌-17 చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిల దూకుడు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని చిత్తుచేసి హ్యాట్రిక్‌ విజయాన్నందుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో భారత్‌ 8-0తో ఆతిథ్య భూటాన్‌ను ఓడించింది. అనుష్క కుమారి (53వ, 61వ, 73వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో విజృంభించి భారత్‌ భారీ గెలుపులో కీలకపాత్ర పోషించింది. అభిస్త బాస్నెట్‌ (23వ, 89వ) రెండు.. పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ (71వ), దివ్యాని లిండా (77వ), వలైనా ఫెర్నాండెజ్‌ (90+2వ నిమిషం) తలో గోల్‌ కొట్టారు. దీంతో టోర్నీలో ఓటమన్నదే లేని భారత అమ్మాయిలు.. మూడు విజయాలతో మొత్తం 9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌ చెరో మూడు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:15 AM