Share News

Travis Heads: హెడ్‌ అజేయ శతకం

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:21 AM

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో...

Travis Heads: హెడ్‌ అజేయ శతకం

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 271/4

ప్రస్తుత ఆధిక్యం 356

అడిలైడ్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 271 పరుగులు చేసింది. హెడ్‌ (142 బ్యాటింగ్‌) అజేయ శతకం సాధించగా.. కేరీ (52 బ్యాటింగ్‌) అర్ధసెంచరీతో క్రీజులో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం కంగారూల ఆధిక్యం 356 రన్స్‌కు చేరింది. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 286 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టోక్స్‌ (83), ఆర్చర్‌ (51) తొమ్మిదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. బోలాండ్‌, కమిన్స్‌లకు మూడేసి, లియోన్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో ఆసీ్‌సకు 85 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 రన్స్‌ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 04:21 AM