Diamond League: చోప్రాకు కఠిన సవాల్
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:07 AM
మరోసారి డైమండ్ లీగ్ (డీఎల్) టైటిల్ సొంతం చేసుకోవాలనుకొంటున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఎదురుకానుంది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో గురువారం రాత్రి జరిగే...
రేపు డైమండ్ లీగ్ ఫైనల్
రాత్రి 11.15 నుంచి..
న్యూఢిల్లీ: మరోసారి డైమండ్ లీగ్ (డీఎల్) టైటిల్ సొంతం చేసుకోవాలనుకొంటున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఎదురుకానుంది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో గురువారం రాత్రి జరిగే డీఎల్ ఫైనల్లో సమకాలీన ప్రత్యర్థులు.. డిఫెండింగ్ చాంప్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జూలియన్ వెబర్ (జర్మనీ) కూడా బరిలో నిలవనున్నారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన చోప్రా సెలెసియా, బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్‌ల్లో పాల్గొనలేదు. దోహా, పారి్‌స ఈవెంట్లలో బరిలోకి దిగిన నీరజ్ నాలుగో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత మేలో దోహాలో జరిగిన ఈవెంట్‌లో చోప్రా 90.23 మీటర్ల దూరం విసిరినా.. వెబర్ తర్వాత రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022లో డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గిన చోప్రా.. 2023, 2024లో రన్నర్‌పగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి