Share News

ఒలింపిక్స్‌లో ‘తార’ ప్రకాశిస్తుంది!

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:21 AM

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటారు. తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయక అంశాలను పంచుకుంటూ ప్రజలలో చైతన్యం...

ఒలింపిక్స్‌లో ‘తార’ ప్రకాశిస్తుంది!

ఆనంద్‌ మహీంద్రా ఆకాంక్ష

ముంబై: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటారు. తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయక అంశాలను పంచుకుంటూ ప్రజలలో చైతన్యం కలిగిస్తుంటారు. ఈకోవలోనే భారత్‌-అమెరికా స్కేటర్‌, 24 ఏళ్ల తారా ప్రసాద్‌ గురించి ఆయన వెల్లడించారు. ‘తారా ప్రసాద్‌ 2019లో అమెరికా పౌరసత్వం వదులుకొని భారత్‌ వచ్చి స్కేటింగ్‌లో రాణిస్తోంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. గత వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే చాన్సు కొద్దిలో మిస్సయిందని తెలిసింది. కానీ 2026 శీతాకాల ఒలింపిక్స్‌కు ఆమె కచ్చితంగా అర్హత సాధిస్తుంది. ఆ క్రీడల్లో పతకంతో మెరుస్తుంది’ అని ఆనంద్‌ మహీంద్రా తారా ప్రసాద్‌లో స్ఫూర్తి నింపారు. తార తల్లిదండ్రులది తమిళనాడు. అయితే వారు అమెరికా వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

ఇవీ చదవండి:

ర్యాంకింగ్స్.. టాప్‌-5లో ముగ్గురు భారత స్టార్లు

ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:21 AM