Share News

Temba Bavuma Returns: బరిలోకి బవుమా

ABN , Publish Date - Oct 28 , 2025 | 02:56 AM

గాయం నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా భారత పర్యటనకు సిద్ధమయ్యాడు. దీంతో వచ్చే నెల 14 నుంచి భారత్‌లో జరిగే రెండు టెస్టుల...

Temba Bavuma Returns: బరిలోకి బవుమా

జొహాన్నెస్‌బర్గ్‌: గాయం నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా భారత పర్యటనకు సిద్ధమయ్యాడు. దీంతో వచ్చే నెల 14 నుంచి భారత్‌లో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సకు అతడి నాయకత్వంలో జట్టు బరిలోకి దిగనున్నట్టు క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎ్‌సఏ) సోమవారం ప్రకటించింది. కోల్‌కతా, గువాహతిలో ఈ టెస్టులు జరుగుతాయి. ఇటీవల పాక్‌తో జరిగిన టెస్టు సిరీ్‌సకు గాయం కారణంగా బవుమా దూరమయ్యాడు. ఆ సిరీ్‌సలో పాల్గొన్న మెజారిటీ ఆటగాళ్లనే భారత పర్యటనకు ఎంపిక చేశారు. అంతకన్నా ముందు నవంబరు 2 నుంచి భారత్‌ ‘ఎ’ టీమ్‌తో దక్షిణాఫ్రికా ఆడనుంది.

జట్టు: బవుమా (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, రికెల్టన్‌, స్టబ్స్‌, వెరీనె, బ్రెవిస్‌, హమ్జా, డి జోర్జి, బాష్‌, ముల్డర్‌, జాన్సెన్‌, కేశవ్‌, ముత్తుస్వామి, రబాడ, హార్మర్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

For More Sports News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 02:56 AM