Telugu Titans Win: క్వాలిఫయర్‌లో టైటాన్స్ గెలుపు
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:21 AM
ఉత్కంఠభరితంగా జరిగిన ప్రొ కబడ్డీ మినీ క్వాలిఫయర్‌లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈమ్యాచ్‌లో టైటాన్స్ 37-32తో...
న్యూఢిల్లీ: ఉత్కంఠభరితంగా జరిగిన ప్రొ కబడ్డీ మినీ క్వాలిఫయర్‌లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈమ్యాచ్‌లో టైటాన్స్ 37-32తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. ఆల్‌రౌండర్ భరత్ హుడా 12 పాయింట్లతో, కెప్టెన్ విజయ్ మాలిక్ 10 పాయింట్లతో టైటాన్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన టైటాన్స్ మంగళవారం జరిగే ఎలిమినేటర్-3 పోరుకి అర్హత సాధించింది. ఇక, ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 48-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News