Share News

Womens World Cup 2025: బ్రిట్స్‌ భళా

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:07 AM

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. తజ్మీన్‌ బ్రిట్స్‌ (101) అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ శతకంతో అదరగొట్టడంతో సోమవారం న్యూజిలాండ్‌పై సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో...

Womens World Cup 2025: బ్రిట్స్‌ భళా

తజ్మీన్‌ రికార్డు శతకం

కివీస్‌పై సఫారీల గెలుపు

ఇండోర్‌: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. తజ్మీన్‌ బ్రిట్స్‌ (101) అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ శతకంతో అదరగొట్టడంతో సోమవారం న్యూజిలాండ్‌పై సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఏడాది బ్రిట్స్‌కు ఇది ఐదో వన్డే శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఒక కేలండర్‌ ఇయర్‌లో నాలుగు శతకాలు బాదిన టీమిండియా స్టార్‌ స్మృతి మంధాన రికార్డును బ్రిట్స్‌ అధిగమించింది. మంధాన నిరుడు నాలుగు, ఈ సంవత్సరం కూడా నాలుగు సెంచరీలు చేసింది. ఇక.. ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 69 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. కివీ్‌సపై ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (85), బ్రూక్‌ హ్యాలీడే (45), జార్జియా ప్లిమ్మర్‌ (31) రాణించారు. స్పిన్నర్‌ ఎంలబాకు 4 వికెట్లు దక్కాయి. కివీస్‌ తమ చివరి ఏడు వికెట్లను కేవలం 44 పరుగుల తేడాతో కోల్పోయింది ఆ తర్వాత ఛేదనలో సౌతాఫ్రికా 40.5 ఓవర్లలోనే 234/4 స్కోరుతో నెగ్గింది. రెండో వికెట్‌కు బ్రిట్స్‌-సున్‌ లూస్‌ (83 నాటౌట్‌) 159 రన్స్‌ జోడించారు. కెర్‌కు 2 వికెట్లు లభించాయి. బ్రిట్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 06:07 AM