Pro Kabaddi League: తలైవాస్ అదుర్స్
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:46 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 56-37తో పట్నా పైరేట్స్‌ను...
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 56-37తో పట్నా పైరేట్స్‌ను చిత్తుగా ఓడించింది. తలైవాస్ ఆటగాడు అర్జున్ దేశ్వాల్ రైడింగ్‌లో 21, బోసన్ ద్వారా 5 పాయింట్లు సాధించాడు. ఇక, ఉత్కంఠగా సాగిన హరియాణా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ జట్ల పోరులో తొలుత 33-33తో స్కోరు సమమైంది. అయితే, ఫలితం కోసం నిర్వహించిన రైడింగ్‌లో దబాంగ్ 9-3తో స్టీలర్స్‌ను ఓడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News