US Open 2025: సెమీస్‌లో స్వియటెక్ జోడీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:54 AM
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ చాంపియన్‌షి్‌పలో స్వియటెక్, డిఫెండింగ్ చాంప్ సారా ఎరాని జంటలు సెమీస్ చేరుకొన్నాయి. క్వార్టర్స్‌లో స్వియటెక్ -కాస్పర్ రూడ్ ద్వయం 4-1, 4-2తో కేటీ మెక్‌నెల్లీ-ముసెట్టి జంటపై...
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ చాంపియన్‌షి్‌పలో స్వియటెక్, డిఫెండింగ్ చాంప్ సారా ఎరాని జంటలు సెమీస్ చేరుకొన్నాయి. క్వార్టర్స్‌లో స్వియటెక్ -కాస్పర్ రూడ్ ద్వయం 4-1, 4-2తో కేటీ మెక్‌నెల్లీ-ముసెట్టి జంటపై గెలిచింది. తొలిరౌండ్‌లో కీన్-టియాఫోపై స్వియటెక్ జోడీ గెలిచింది. క్వార్టర్స్‌లో ఎరాని-వవస్సోరి జంట 4-1, 5-4(4)తో ముచోవా-రుబ్లేవ్‌పై నెగ్గింది. మొదటి రౌండ్‌లో రిబకినా-ఫ్రిట్జ్‌పై 4-2, 4-2తో ఎరాని జంట నెగ్గింది. కాగా, వీనస్ విలియమ్స్-రిల్లీ ఒపెల్కా 2-4, 4-5(2)తో ముచోవా-రుబ్లేవ్ ద్వయం చేతిలో, ఒసాక-మోన్‌ఫిల్స్ జోడీ 3-5, 2-4తో కేటీ-ముసెట్టి జంట చేతిలో తొలి రౌండ్‌లోనే ఓడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News