Suryakumar Yadav: రాజకీయ వ్యాఖ్యలొద్దు
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:57 AM
పాకిస్థాన్‌తో ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలతో టీమిం డియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడే పరిస్థితి ఎదురైంది. ఈ వ్యాఖ్యలపై ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు....
సూర్యకు రెఫరీ మందలింపు
పాక్ క్రికెటర్లపై భారత్ ఫిర్యాదు
దుబాయ్ : పాకిస్థాన్‌తో ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలతో టీమిం డియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడే పరిస్థితి ఎదురైంది. ఈ వ్యాఖ్యలపై ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌తో కలిసి సూర్యకుమార్ విచారణకు హాజరయ్యాడు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూర్యకు రెఫరీ సూచించినట్టు తెలిసింది. అయితే ఆ వ్యాఖ్యలకుగాను సూర్యకుమార్‌కు విధించే శిక్షను రెఫరీ నిర్ధారించలేదు. కానీ..సూర్య వ్యాఖ్య లు లెవల్-1 తప్పిదంగా భావిస్తున్నారు. దాంతో అతడిని హెచ్చరించడమో లేదంటే మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమో చేస్తారని టోర్నమెంట్ వర్గాలు వెల్లడించాయి. సూర్య కుమార్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ జట్టు యాజమాన్యం తనకు రెండు నివేదికలు అంద జేసిందని మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్‌సన్ భారత జట్టు యాజమాన్యానికి ఈ-మెయిల్ పంపాడు. పాకిస్థాన్ చేసిన ఫిర్యాదులు, అందుకు సంబంధిం చిన ఆధారాలను పరిశీలిస్తే.. సూర్యకుమార్ వ్యాఖ్యలు క్రికెట్ ప్రతిష్ఠను భంగపరిచేలా ఉన్నట్టు తెలుస్తోందని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.
సూర్య ఏమన్నాడంటే..
ఈనెల 14న పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఘ న విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత సూర్య మాట్లాడుతూ.. ‘పహల్గామ్ దాడి లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇంతకంటే అద్భుతమైన సమయం ఉండదు. ఆ కుటుంబాలకు మేం సంఘీభావం ప్రకటిస్తున్నాం. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మా భద్రతా బలగాలకు ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాం’ అని అతడు చెప్పాడు. అంతేకాదు..బీసీసీఐ, తమ ప్రభుత్వ సూచన మేరకు మ్యాచ్ తర్వాత ప్రత్యర్థి జట్టు క్రికెటర్లతో కరచాలనం చేయలేదని కూడా సూర్యకుమార్ తెలిపాడు.
హారిస్, ఫర్హాన్‌పై భారత్ ఫిర్యాదు
పాక్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌పై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. ఈనెల 21న భారత్‌తో మ్యాచ్ సందర్భంగా వారు ప్రవర్తించిన తీరు రెచ్చగొట్టేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తమపై భారత్ సైనిక చర్య విఫలమైందన్న కోణంలో..విమానం కూలిపోతున్న తీరుగా పాక్ పేసర్ రౌఫ్ సైగలు చేశాడు. అలాగే భారత ఓపెనర్లు అభిషేక్, గిల్‌ను రౌఫ్ దూషిం చాడు. ఇక..అదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సంబ రాన్ని ఓపెనర్ ఫర్హాన్ ‘గన్ ఫైరింగ్’ తరహాలో చేసుకున్నాడు.
నేడు పాక్ క్రికెటర్ల విచారణ
బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై పాకిస్థాన్ ఆటగాళ్లు రౌఫ్, ఫర్హాన్‌లను రెఫరీ రిచీ రిచర్డ్‌సన్ శుక్రవారం విచారించనున్నాడు. బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో గురువారం వారిని విచారించలేదు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి