Suryakumar Yadav: పాక్‌తో మ్యాచ్‌లో మనోళ్ల దూకుడు పక్కా.. స్పష్టం చేసిన సూర్యకుమార్
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:19 PM
పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా దూకుడుగా ఉంటుందని కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. ఆసియా కప్ టోర్నీ మొదలుపెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నానని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లు ఎలా ఉండబోతున్నాయో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టంగా చెప్పేశాడు. మైదానంలో దూకుడు తప్పదని వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌కు ముందు నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత దయాది దేశాలు తొలిసారిగా ఈ టోర్నీలో తలపడుతున్నాయి. దీంతో, మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది (Suryakumar Yadav).
సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, పాక్ టీమ్స్ తలపడనున్నాయి. టెన్షన్స్ పీక్స్‌లో ఉండటం పక్కా. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ కీలక కామెంట్స్ చేశాడు. మైదానంలో తమ టీమ్ దూకుడుగా ఆడటం పక్కా అని తేల్చి చెప్పాడు.
‘మైదానంలో దిగిన ప్రతిసారీ టీమ్‌లో దూకుడు కనిపిస్తుంది. అసలు ఇది లేకుండా మ్యాచ్ ఆడలేము కదా. టోర్నీ ఆరంభించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము’ అని సూర్యకుమార్ కామెంట్ చేశాడు (Asia Cup Ind Vs Pak).
తమదీ ఇదే రూట్ అని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా స్పష్టం చేశాడు. ఈ దూకుడు మైదానానికే పరిమితమైనంత వరకూ తాను తన టీమ్ సభ్యులకు అడ్డుచెప్పనని అన్నాడు. ‘ఈ విషయంలో ప్లేయర్‌లకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ప్రతి ఒక్కరికీ వారి సొంత వ్యక్తిత్వం అంటూ ఉంటుంది. మైదానంలో ఎవరైనా దూకుడు ప్రదర్శిస్తానంటే అందులో అభ్యంతరం చెప్పేందుకు ఏమీ ఉండదు. అలాంటి వాళ్లను ఆపకూడదు కూడా. వారిని ముందుకు నడిపించేది అదే. నా మటుకు నేను ప్రత్యేకంగా ఎవరికీ ఎలాంటి సూచనలు చేయట్లేదు. ఏదైనా మైదానానికే పరిమితం కావాలి’ అని అన్నాడు (Pak Captain Salman Agha).
టీమిండియా ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉందని సూర్యకుమార్ తెలిపాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నామని అన్నాడు. ఆసియా కప్‌లో అద్భుత టీమ్స్‌తో బరిలోకి దిగే అవకాశం ఆనందాన్ని ఇస్తోందని అన్నాడు. మిన్నోస్ యూఏఈ మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి