Share News

Surya Comeback: ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో సూర్య పాసయ్యాడు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:33 AM

ఆసియాకప్‌ టీ20 టోర్నీకి ముందు టీమిండియాకు శుభవార్త. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ టెస్టులోనూ పాసయ్యాడు....

Surya Comeback: ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో సూర్య పాసయ్యాడు

బెంగళూరు: ఆసియాకప్‌ టీ20 టోర్నీకి ముందు టీమిండియాకు శుభవార్త. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ టెస్టులోనూ పాసయ్యాడు. జూన్‌లో హెర్నియా సర్జరీ తర్వాత అతను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ పునరావాస శిబిరంలో చేరాడు. ఇటీవలే పూర్తి స్థాయిలో కోలుకున్న సూర్య బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడు. ఇక తాజా ఫలితంతో అతను ఆసియాకప్‌ బరిలో దిగడం ఖాయమైంది. అలాగే ఈనెల 19న ఆసియాకప్‌ జట్టు ఎంపికలో పాల్గొనేందుకు సూర్య ముంబైకి వెళ్లనునున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:33 AM