Share News

CAFA Nations Cup: ఛెత్రికి దక్కని చోటు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:25 AM

కాఫా నేషన్స్‌ కప్‌ కోసం భారత ఫుట్‌బాల్‌ కొత్త కోచ్‌ ఖాలిద్‌ జమీల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నీ కోసం ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్‌లో దిగ్గజ ఫుట్‌బాలర్‌...

CAFA Nations Cup: ఛెత్రికి దక్కని చోటు

కాఫా నేషన్స్‌ కప్‌నకు భారత ప్రాబబుల్స్‌

న్యూఢిల్లీ: కాఫా నేషన్స్‌ కప్‌ కోసం భారత ఫుట్‌బాల్‌ కొత్త కోచ్‌ ఖాలిద్‌ జమీల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నీ కోసం ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్‌లో దిగ్గజ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రికి చోటు దక్కలేదు. ఈ విషయమై అటు భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య, కోచ్‌ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడం గమనార్హం. ఆగస్టు 29 నుంచి తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లలో ఈ టోర్నీ జరుగుతుంది. భారత్‌తో పాటు తజకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, ఇరాన్‌ టోర్నీలో ఆడుతున్నాయి. 40 ఏళ్ల ఛెత్రి గత జూన్‌లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే అప్పటి కోచ్‌ మార్క్వెజ్‌ వినతి మేరకు ఈ మార్చిలో ఆసియాకప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడాడు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఛెత్రి కెరీర్‌ ఇక ముగిసినట్టే.

ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:25 AM